Kolkata: గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేద్దామనుకున్న ఇద్దరు లేడీస్ అనూహ్య రీతిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటన కోల్‌కతాలో మంగళవారం జరిగింది. సూట్‌కేస్‌లో శవాన్ని తీసుకువచ్చిన ఇద్దరు మహిళలు, నగరంలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్‌లో పారేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, రోజూ వారీ యోగా సెషన్‌కి వచ్చే వారు వీరిని పట్టుకున్నారు. సూట్‌కేస్‌లో మృతదేహాన్ని చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.
కుమార్తులి ప్రాంతం దుర్గా పూజ కోసం విగ్రహాలు నిర్మించే శిల్పులకు కేంద్రంగా ఉంది. దుర్గాపూజ సమయంలో తప్పితే, మిగతా సమయంలో జనసంచారం తక్కువగా ఉంటూ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో నదిలో మృతదేహాన్ని పారేయాలని ఇద్దరు మహిళలు భావించినట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో, ఇద్దరు మహిళలు క్యాబ్ నుంచి ట్రాలీ సూట్‌కేస్ తో దిగడాన్ని అక్కడే ఉన్న స్థానికులు చూశాడు. ఇద్దరు మహిళల కదలికలపై అనుమానం వ్యక్తం చేశారు. సూట్‌కేస్‌ని నది వైపుగా లాగడానికి ప్రయత్నించారు. అయితే, వీరిద్దరు దానిని కదపలేకపోయారు. దీనిపై అక్కడే ఉన్న యోగా చేసేవారు అనుమానం వ్యక్తం చేశారు.
Read Also: Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..
మహిళల్ని ప్రశ్నించగా, వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. సూట్‌కేస్‌లో లాబ్రడార్ కుక్క మృతదేహం ఉన్నట్లు చెప్పారు. అయితే, ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో రక్తపు మరకలతో ఉన్న స్త్రీ మృతదేహం కనిపించింది. స్థానిక ప్రజలు ముందుగా ప్రశ్నించగా, ఇద్దరు మహిళల్లో ఒకరు తమ వదిన ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతదేహమే ఇది అని చెప్పారు.
ఇద్దరు మహిళల్ని ఫల్గుణి ఘోష్, ఆమె తల్లి ఆరతి ఘోష్‌గా గుర్తించారు. పోలీసులు వీరిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వీరిద్దరు కాజిపారా నుంచి కుమార్తులికి రైలులో వచ్చినట్లు తేలింది. కోల్‌కతాకు సమీపంలోని మధ్యగ్రామ్ లో గత కొంత కాలంగా ఇద్దరు నివాసం ఉంటున్నట్లు తేలింది. రాత్రి సమయంలో అపరిచితులు వీరి ఇంటికి వస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. మృతదేహం ఎవరిది, హత్యా..? ఆత్మహత్య..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.