RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్‌ను దోషిగా నిర్ధారించింది.
RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) తన తీర్పును వెల్లడించనుంది.
RG Kar Verdict: పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ కు మరణ శిక్షను విధించే సాక్ష్యాలను సీబీఐ గురువారం నాడు సీల్దా సెషన్స్ న్యాయస్థానానికి అందించింది.
Bangladeshi Singer షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి మతోన్మాద ఉగ్ర సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులకు తెగబడుతున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా…
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు.
Bangladesh: భారతదేశంలోని ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ సర్కార్ ఆదేశించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. కోల్‌కతాలోని డిప్యూటీ హైకమిషనర్ షిక్దార్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్, త్రిపురలోని అగర్తలలో గల అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహమ్మద్‌ను రీకాల్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత కేటాయించారు. ఇటీవల బాలీవుడ్ నటులకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తి కూడా చేశారు. తాజాగా సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను పెంచింది.