Kolkata : కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచింది. అయితే దోషులకు ఇంతవరకు శిక్ష పడలేదు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌తో యాప్ ఆధారిత బైక్ డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన చర్య సంచలనం సృష్టించింది. రైడ్ ఆలస్యం కావడంతో తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేయగా, డ్రైవర్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని మహిళా డాక్టర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు వంటి…
West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.
దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సమే సృష్టించనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో దానా తుఫాన్ హడలెత్తించనుంది. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ‘దానా’ తుఫానుగా నామాకరణం చేసినట్లు ఐఎండీ తెలిపింది.
Fire Accident In Hospital: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో మొత్తం ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒక రోగి మృతి చెందాడు. మంటలు చెలరేగినప్పుడు చాలా మంది రోగులు సీల్దా ప్రాంతంలో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఆసుపత్రిలో ఉన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక వాహనాలు ఆసుపత్రికి చేరుకొని, ఘటనా స్థలం నుంచి…
Kolkata: కోల్‌కతాలో కొందరు మతోన్మాదుల ముస్లింమూక దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. నగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్‌కి చెందిన పూజా మండపై ముస్లిం గుప్పు దాడి చేసి, పూజలు నిర్వహించరాని బెదిరించారు. దాదాపుగా 50-60 మంది సభ్యులతో కూడిన ముస్లిం గుంపు వేడకల్ని ఆపకపోతే విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. Read Also: India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్…
Kolkata: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో (శుక్రవారం) ఆరో రోజుకు చేరుకుంది.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన మరోసారి ఉధృతం అవుతోంది. ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక ఆమెకు మద్దతుగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చెందిన యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. అయితే వారు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం, కోల్‌కతాలోని ధర్మటాలకు చెందిన జూనియర్ డాక్టర్ దేబాశిష్ హల్దర్…