కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? అని మండిపడింది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎవరికి హాని చేయడని చెప్పింది. ఎవరో తన కొడుకును ఇరికించారని.. అతనిని కఠినంగా శిక్షించాలని రాయ్ తల్లి డిమాండ్ చేసింది.