Kolkata Doctor Rape and Murder Case: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు తెలిపాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. సీబీఐ తనదైన శైలిలో విచారణ చేస్తోంది. మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం దగ్గర ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు.
ఇదిలా ఉంటే, నిందితుడి అత్త తన అల్లుడిని ఉరితీయాలని డిమాండ్ చేసింది. నా కుమార్తెను అతను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లై రెండేళ్లు అయిందని, మొదట్లో 6 నెలలు అంతా బాగానే ఉందని, నా కుమార్తె 3 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో సంజయ్ రాయ్ కొట్టాడని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంగానే ఉందని, ఆమె మందుల ఖర్చులన్నీ నేను భరించలేదని చెప్పారు.
ఇదిలా ఉంటే దేశంలో సంచలనంగా నిలిచిన ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్‌కతా డాక్టర్ కేసును అప్పగించారు. ఇంతకుముందు సంచలనాత్మ కేసుల్లో దర్యాప్తు చేసి విజయం సాధించిన వీరిద్దరు ఇప్పుడు కోల్‌కతా కేసుని డీల్ చేయబోతున్నారు.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ గత రెంమూడు రోజులుగా విచారిస్తోంది. విచారణ…
Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’ నిర్వహించాలని సీబీఐ పిటిషన్‌కి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత శుక్రవారం 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది.
Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు వస్తున్నా్యి. చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిదని బాధితురాలి తల్లిదండ్రులు ఇప్పటికే ఆరోపించారు. మ
Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన ఆమెనే, న్యాయం కోసం రోడెక్కి ర్యాలీ చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యాన్ని కలకత్తా హైకోర్టు తూర్పారపడుతోంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ కూతరు చనిపోయిన మొదటి రోజు నుంచే పోలీసులు వేధింపులు ప్రారంభయమ్యాయని, కుమార్తె మృతదేహం చూసేందుకు 3 గంటల పాటు అనుమతించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటన కాదని, దీని వెనక ఇతరుల ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. తమ కుమార్తె ఆరోగ్యం, ఆమె వద్ద దొరికిన మెడిసిన్స్‌పై దృష్టి సారించారని, కేసుని పక్కదారి పట్టించే…