కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
Medical Services Stopped: కోల్‌కతా నగరంలో జరిగిన ట్రైని డాక్టర్ అత్యాచార ఘటన నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా ఓపిడి, ఓటి సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు దేశ ప్రజలకు ముందస్తు…
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక రోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నిర్ణయం తీసుకుంది.
Bengal Governor: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ, సీపీఎం పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటన వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు ఇప్పుడు ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు.. అతనిపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఘోష్‌ను వేరేచోటికి ట్రాన్స్‌ఫర్ చేసినా.. హైకోర్టు మాత్రం సెలవుపై పంపించింది.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ ఒక్క ఘటనే కాదు ఆస్పత్రులు వేదికగా జరిగిన మూడు అత్యాచార ఘటనలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురించేంది. ముంబైలో 1973లో జరిగిన ‘‘అరుణా షాన్‌బాగ్’’ ఘటన ఇందులో మొదటి ఈ ఘటన జరిగి 50 ఏళ్లు గడిచినా కూడా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. 50 ఏళ్ల తర్వాత ఇదే తీరుగా కోల్‌కతా…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన దేశాన్నే కలచివేస్తుందన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై క్రూరత్వం వంటి ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయని తెలిపారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. అంత హింసాత్మకంగా వైద్యురాలిపై దాడి జరిగింది. ఇక ఘటనాస్థలిలో బాధితురాలు అర్ధనగ్నంగా పడి ఉండడం.. దేహమంతా గాయాలై.. రక్తసిక్తంగా శవమై పడి ఉంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు(శుక్రవారం) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ చేపట్టారు. వైద్యురాలికి మద్దతు నిరసన తెలుపుతున్న సమయంలో కొందరు దుండగులు ఆస్పత్రిలోకి చొరబడి దాడి చేశారు.