కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్ కతా మాంత్రం అట్టుడికి పోతుంది. విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.
కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. నేడు రాష్ట్ర రాజాధాని కోల్ కతాలో విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత వైద్యురాలు ఆగస్టు 9 తెల్లవారుజామున 2:45 వరకు జీవించి ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ద్వారా ఇది ధృవీకరించబడింది.
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
Kolkata Doctor Murder Case: ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసి లేఖ తాజాగా వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మమత లేఖ రాసింది. కోల్‌కతా ఘటన తర్వాత ఈ లేఖ వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ పంపిన రహస్య లేఖను స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయం తిరస్కరించిందని రాజ్‌భవన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బుధవారం మహిళా వైద్యురాలి తల్లిదండ్రులను గవర్నర్ బోస్ కలిశారు.