Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో గత వారం 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. ఈ కేసుని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ హర్భజన్ సింగ్ ప్రకటన వెలువడింది.
Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత వారం అత్యాచారం హత్యకి గురైన 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ ఘటన దేశంలో ఆగ్రహావేశాలకు కారణమైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను అత్యంతదారుణంగా రేప్ చేసి చంపారు. కాలేజీలోని సెమినార్ హాలులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Women Harassment: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలికి న్యాయం కోసం మహిళలు, తోటి వైద్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుల అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నిందితులను కాపాడుతుందా..?
ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది.. అన్ని ఆస్పత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సమావేశం అయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ట్రాన్స్‌జెండర్స్ కూడా రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శనివారం వైద్యులు, నర్సులు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య బృందాలతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నిరసన తెలిపారు
Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలోని భాగాలను పునరుద్ధరించాల్సిన అత్యవసరం ఏమిటి..? అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Doctors strike: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.