దేశ సర్వోన్నత న్యాయస్థానం హామీ మేరకు వైద్యులు మెత్తబడ్డారు. సమ్మె విరమించాలంటూ సుప్రీంకోర్టు చేసిన విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ప్రకటించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా రోజు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోడీని లేఖలో కోరారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగికముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.
కోల్‌కతా అత్యాచారం-హత్య కేసులో బాధితురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు షాకింగ్ వాదనలు చేశారు. తమ కుమార్తెను హత్య చేసేందుకు నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఎవరో పంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. కోల్‌కతా పోలీసులకు చెందిన సంజయ్ రాయ్‌ను ఆగస్టు 10న అరెస్టు చేశారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీం కోర్టు వారికి హామీ ఇచ్చింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది.
Kolkata Doctor Murder Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆ టైంలో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్‌కతా పోలీసు విభాగం ఇవాళ (ఆగస్ట్ 21) సస్పెండ్ చేసింది.