‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.…
ప్రజా ప్రతినిధులంతా ప్రజల వద్దకు వెళ్లేలా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలనుంచి ప్రజా ప్రతినిధులకు నిరసన తప్పడంలేదు, తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీశారు ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ వచ్చాక అన్నీ ఇస్తున్నాడు.. కానీ, అన్ని ధరలు పెంచాడని ఆ వృద్ధురాలు నిలదీసింది ఆమె. Read Also: Nageswara Rao: ఆంధ్రప్రదేశ్‌ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..!…
ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు చెబుతా.. కేసు పెడతా అంటారు కొందరు. దీంతో ఎదుటి పక్షం భయపడుతుందనేది వాళ్ల అభిప్రాయం. ఆ నియోజకవర్గంలోనూ అంతే..! కాకపోతే ఖాకీల పేరు చెప్పి కాసులు వెనకేసుకుంటున్నారట అధికారపార్టీ నేతలు. వర్గపోరు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నారు. పోలీసుల పేరుతో పార్టీ నేతల వసూళ్లు? కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. ఇదే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి. ఎవరి వర్గం వారిదే. మొదటి నుంచి అస్సలు పడటం…