మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సీఎం జగన్‌తో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఎవరు కలిసినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. వారిని చెల్లాచెదురు చేయడానికి సింహం రెడీగా ఉందన్నారు. జగన్‌కు ఉన్న 50 శాతంపైగా ఓట్లు అలాగే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లోనూ…
2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు మాజీ మంత్రి కొడాలినాలి. గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు మరింత పనిచేయాలని సూచించారన్నారు. గ్రాఫ్ పెంచుకోకపోతే… వారిని పక్కనపెట్టే అవకాశం కూడా ఉందని చెప్పారాయన. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే ఉండదన్నారు. విభేదాలు విడనాడి అందరూ కలసి పనిచేయాలని ఆదేశించిన ఆయనచారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా…
వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి.. రెండో కేబినెట్‌లో మాత్రం చోటు దక్కలేదు.. అయితే, మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి.. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో పర్యటించారు.. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికి ఘన స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన పై అధికార పార్టీ నాయకులు మాట్లాడలేక పోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విటర్ లో పెడితే దానిపై కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జగన్ చంద్రబాబు ను నడి రోడ్డులో ఉరి వెయ్యండి అంటే ఏ కేసులు పెట్టలేదన్నారు. మీ సహచర మాజీమంత్రి కొడాలి నాని, తాజా…
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువు గా పేరొందారు . నైజాం లో ఎగ్జిబిటర్ మరియు పంపిణీదారులుగా విశేష సేవలందించారు .వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. కొడాలి నాని
ఏపీ కేబినెట్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు కేబినెట్ పై మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయి రెడ్డిలకు పంచాక బీసీలకు ఎన్ని మంత్రి పదవులిస్తే ఏం లాభం..? అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారం తమ చేతుల్లో పెట్టుకుని బీసీ మంత్రులను కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు. బీసీలను పావులుగా వాడుకునే వైసీపీకు, సముచిత న్యాయం కల్పించిన టీడీపీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.…
ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము…
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆయన్ని బతిమాలుతూ, బామాలుతూ,, సర్దిచెబుతున్నారు వైసీపీ నేతలు. సలహాదారు సజ్జల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ…
జగన్ మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. 25 మంది మంత్రులతో జగన్ కేబినెట్ కొలువుదీరింది. అయితే, ఆశించిన మంత్రిపదవి రాకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనకు మంత్రి పదవి రాలేదంటూ కామెంట్లు చేయడం విశేషం. సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. నామినేటెడ్ పదవులు పొంది.. సీఎం క్యాంప్ ఆఫీస్…