విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ పెరుగుతోంది… టీడీపీకి కూడా దీనిపై ఉద్యమానికి సిద్ధం అవుతుంది.. రేపు వేలాది మందితో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు.. ఈ సందర్భంగా వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఉమ… రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితులైన కొడాలి నాని, వంశీమోహన్ ద్వారా ఈ జిల్లాకు రంగా పేరు పెట్టాలని…
టీడీపీ, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో నేను నేర్పుతా అని సోమువీర్రాజు అంటున్నాడు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి ఎలా చేసుకోవాలో తెలియదా? టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకొని..చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి సోము వీర్రాజు అని మండిపడ్డారు. గోవా కల్చర్ అంటున్నారు..గోవాలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. గోవాలో ఎందుకు కాసినో కల్చర్ ను బ్యాన్ చేయడం లేదు. చంద్రబాబు శిష్యులు బీజేపీలో ఉన్నారు.…
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు చాలా సీరియస్ గా వున్నారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి నివేదిక అందచేశారు. గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను గవర్నరుకి అందచేస్తాం. గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తాం అన్నారు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర. క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నాని పాన్ పరాగ్…
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2),…
క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి కొడాలి నాని. చెత్తకాగితాలు తెచ్చి ఇవిగో ఆధారాలు అంటున్నారు. మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే టీడీపీ నేతల ప్రయత్నం. కరోనా వచ్చి ఆస్పత్రిలో వుంటే నన్ను టార్గెట్ చేశారని విమర్శించారు. కే కన్వెన్షన్ లో కేసినో జరిగినట్టు నిరూపించాల్సిందే. టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో వున్నది ఎవరు? కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో నిందితులుగా వున్నవారు ఆ కమిటీలో వున్నారన్నారు నాని. బోండా ఉమ పిచ్చిపిచ్చి…
విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు బుద్దా వెంకన్నను తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు అడ్డుపడ్డారు టీడీపీ కార్యకర్తలు.. బుద్దా అనుచరులు. బుద్ధా వెంకన్నపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153, 505, 506 సెక్షన్ల కింద FIR నమోదయింది. బుద్దాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మైలవరపు దుర్గారావు. కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని,…
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పీఆర్సీ అంశం కంటే గుడివాడ క్యాసినో కథ.. రంజుగా మారింది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. రోజుకో ట్విస్ట్ ఇందులో బయటపడుతోంది. తాజాగా టీడీపీ మహిళా నేత అనిత తీవ్రంగా స్పందించారు. ఏపీలో గోవా కల్చర్ తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి వైసీపీ నేతలు మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా కనీసం నోరు కూడా విప్పడం లేదని అనిత…