గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తిగా సీఎం జగన్ చరిత్రలో…
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.. ఆయన ఏ పార్టీకి చెందినవారు కాదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు…
ఏపీలో పొలిటికల్ టార్గెట్స్ పర్సనల్ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీన్ని టీడీపీ…
ఏపీలో టీడీపీ మాటెత్తితే అంతెత్తున లేస్తారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని). చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ నేతల్ని ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది ఈసారి నానిగారి టార్గెట్ మారింది. బీజేపీ నేతలపై ఆయనన విమర్శలు చేస్తున్నారు. గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన…