తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు.. సహాయం చేసిన చేతులనే నరికి వేస్తున్న సంఘటనలు.. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చినందుకు చంపి పాతర వేశాడు.. తన పాడు బుద్ధులను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు సహాయం చేసిన అడ్వకేట్ ని వేటాడి చంపేసిన తీరు ఇది. హైదరాబాదులోని చంపాపేట్‌లో జరిగిన దారుణ సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. పాతబస్తీ చంపాపేట్‌కు చెందిన ఎర్రబాబు ఇజ్రాయిల్.. ఇతను ఒక న్యాయవాది.. హైకోర్టుతో పాటు సిటీలోని…
భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి చేసిన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట (మం) బలిజపల్లి పూసల కాలనీలో బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులపై కుమారుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్ x రోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
Puducherry : పుదుచ్చేరిలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రెడ్డియార్ పాళయం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, 11వ తరగతి విద్యార్థి కత్తితో వచ్చి మరో విద్యార్థిపై దాడి చేశాడు.
కృష్ణా జిల్లా పెడనలో సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పెడన మండలం నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడి చేశారు.
Medak Crime: డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలు ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు యువతి వచ్చింది.
RSS in Jaipur: జైపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యక్రమం సందర్భంగా కత్తులు, కర్రలతో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. శరద్ పూర్ణిమ సందర్భంగా జైపూర్ లోని కర్ణి విహార్‌లో ఖీర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా.. గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారు జైపూర్…
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రామకృష్ణ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్న రమ్య అనే యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రమ్య వెంట తనను ప్రేమించాలని ఎంతో కాలంగా వేధిస్తున్నట్లు సమాచారం.
బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద ఏసుబాబు అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు.