Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..
- మెదక్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ప్రేమోన్మాది ఘాతుకం..
- ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసిన చేతన్ అనే యువకుడు..
- యువతి అడ్డుకోబోతుండగా చేతికి తీవ్ర గాయం-ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలు ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్ పట్టణంలో సంచలనంగా మారింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు యువతి వచ్చింది. అక్కడే వున్న చేతన్ అనే యువకుడు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. యువతిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై చేతన్ అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. కత్తితో దాడి చేస్తున్న చేతన్ ను యువతి అడ్డుకోబోయింది అయినా చేతన్ ఆమెపై విరుచుకుపడ్డాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడారు. ఈ ప్రమాదంలో యువతి చేతికి తీవ్ర గాయమైంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చేతన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడు వాడిన కత్తి, యువతి సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఘటన స్థలం వద్ద సీసీ కెమెరాల లేకపోవడంతో చుట్టుపక్కల సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!