ఆర్థిక క్రమశిక్షణ, అవసరమైన చోట నిధులను సద్వినియోగ పరుచుకోవడం ద్వారానే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ చైర్మన్ అమిత్ షా స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ నెల 9న నర్సాపూర్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అని తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్ర మంత్రులు దగుల్బాజీ మాటలు మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫైర్ అయ్యారు.