మునుగోడులో బీజేపీదే నైతిక విజయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. 'ప్రలోభాలు, బెదిరింపులతో TRS గెలిచింది. సీఎం, మంత్రులు ఇంఛార్జ్ లుగా వ్యవహరించారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. డిపాజిట్ రాని స్థితి నుంచి రెండోస్థానంలోకి వచ్చామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై అనేక విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేత స్వామీ గౌడ్ మండిపడ్డారు. ఎవరు ఎవరికి అమ్ముడు పోలేదని, బండి సంజయ్ ఆ కామెంట్స్ ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.