అధికార పార్టీ పూర్తిగా దిగజారిందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి ఉప ఎన్నికలో ఒక గ్రామానికి ఇంఛార్జిగా ఉండడం గతంలో జరగలేదు… భవిష్యత్‌లో జరగదు అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్య పెట్టలేరని ఆయన అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇస్తారు.. ఆ తరవాత మర్చిపోతారని ఆయన విమర్శించారు. చిల్లర రాజకీయాలు, తొండి ఎన్నికలు చేయాలని అనుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండలో గెలిచింది వాళ్ళు… ప్రశ్నలు మమ్మల్ని వేస్తున్నారు…. సమాధానాలు మేము చెప్పాలి.. కనీస నైతిక , మానవతా విలువలు లేకుండా , జ్ఞానం లేకండా బతికి ఉన్న వారికీ సమాధి కట్టే సంప్రదాయం టీఆర్‌ఎస్ పార్టీ తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డారు.
జేపీ నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. అయన సమాధి కట్టే నీచ నికృష్ట చర్యలకు దిగింది అంటూ ఆయన ధ్వజమెత్తారు. దేనికైనా పరిమితులు, లక్ష్మణ రేఖను ఆ పార్టీ దాటిందని, బయ్యారంలో మేము ఎప్పుడు హామీ ఇవ్వలేదు… హామీ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పింది వాళ్లు అని ఆయన వెల్లడించారు. నా దిష్టిబొమ్మ దగ్దం చేశారని, ఉన్మాదానికి కూడా ఒక పరిమితి ఉంటుందని, మా సహనాన్ని అసమర్థగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బతికి ఉన్న వారికి నివాళులు అర్పించే సంప్రదాయం కల్వకుంట్ల కుటుంబానిది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.