Kishan Reddy : టీఅర్ఎస్ తొండి ఆట ఆడుతోంది.. మంత్రులు ఏకంగా ప్రజలకు లిక్కర్, చికెన్ వడ్డిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆసక్తి రేపుతోంది. అయితే.. తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ – విజయవాడ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టాలని కోరామన్నారు. అంతేకాకుండా.. అంబేడ్కర్ సర్క్యూట్ పేరుతో ఓ రైల్ ప్రవేశ పెట్టాలని, అతి త్వరలో ఈ ట్రైన్ ప్రవేశ పెడతామని అన్నారని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించడం లేదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చి సహకారం అందించిందన్నారు. కరోనా వాక్సిన్‌పై కేటీఆర్ బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మునుగోడులో బీజేపీకి అనుకూలంగా పరిస్థితి ఉందని, టీఅర్ఎస్ తొండి ఆట ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Errabelli Dayakar Rao : ఉపాధి హామీ పథకంతో దేశంలో తెలంగాణకు నంబర్ వన్ అవార్డు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ప్రగతి భవన్ నుంచి మునుగోడు ప్రజలకు ఫోన్లు చేస్తున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఊర్లలో తిష్ట వేసి ప్రజల్ని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులు ఏకంగా ప్రజలకు లిక్కర్, చికెన్ వడ్డిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేయాలని టీఅర్ ఎస్ ప్రోత్సాహం ఇస్తోందన్నారు. అంతేకాకుండా.. నిన్న టీఆర్‌ఎస్ నేత పద్మారావుతో కిషన్‌రెడ్డి ఉన్న వీడియో హాల్ చల్ చేయడంతో.. పద్మారావు పార్టీ మారుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే.. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. పద్మారావు కొడుకు పెళ్లికి వెళ్లి వారిని ఆశీర్వదించానని, పెళ్లికి వెళ్తే టచ్ లో ఉన్నట్టా అని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో పోటీ బీజేపీ-టీఆర్ఎస్ మధ్య నే ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్టే లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..