Kishan Reddy : టీఆర్ఎస్ నిరాశతో దాడులకు దిగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ నేతలు దాడికి దిగన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎంపీ అర్వింద్ నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకొని.. అర్వింద్ తల్లిని పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి పాలక పక్షం వారి దాడి అని అన్నారు. పోలీస్ సమక్షంలోనే దాడి జరిగింది… పోలీసులు ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు.
Also Read : Revanth Reddy : ఎమ్మెల్సీ కవిత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలి.. ఎవరు ఆఫర్ ఇచ్చారో తెలుసుకొని అరెస్ట్ చేయాలి
రాష్ట్ర రాజధానిలో… ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలో దాడి చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అహంకారపూరితంగా… నిరాశ నిస్పృహలతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నారు. వచ్చే అక్టోబర్ వరకు సర్వేలు ఆపండని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Uddav Shivsena: మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చే యోచనలో ఉద్ధవ్-శివసేన.. ఎందుకంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఓడిపోతామనే భయం… సీఎం కుర్చీ వదలాల్సి వస్తుందనే భయంతో దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. రాష్టాన్ని రాక్షస రాజ్యం… నిజాం రాజ్యంగా రాష్టాన్ని మారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు రాష్టానికి నష్టం చేకూరుస్తున్నాయని, ప్రతి విమర్శలు చేసుకోవడంలో తప్పు లేదని, ముఖ్యమంత్రి కుమారుడు ప్రధానిని అనరాని మాటలు అన్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని, బీజేపీకి నాయకత్వ, అధికార కాంక్ష లేదని ఆయన అన్నారు. దేశం కోసం, సిద్దాంతం కోసం పని చేస్తామని, బీజేపీకి ఎలాంటి తొందర లేదని, ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చాలని కేసీఆర్ చూస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని మాకు లేదన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ సమాజం మా వెంట ఉందన్నారు. సిద్ధాంతం, పార్టీ మీద విశ్వాసం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటామని, ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్‌లో చేర్చుకునే నేర్పరితనం ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కే అని ఆయన విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ ను మొట్టమొదటిగా కేసు పెట్టి విచారించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. ఇతర పార్టీల మెప్పు కోసం, ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, దాడులు, బెదిరింపులను తెలంగాణ సమాజం మెచ్చుకోదన్నారు కిషన్‌రెడ్డి.
తెలంగాణలో మార్పు రాబోతున్నదని, ఊరికోక ఎమ్మెల్యే ఉంటేనే మునుగోడులో ఏలాంటి ఫలితాలు వచ్చాయో అందరు చూసారన్నారు. దాడులకు సరైన సమయంలో సరైన జవాబు ఇస్తారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌజ్ కే పరిమితమన్నారు. నిరాశ నిస్పృహల్లో కల్వకుంట్ల కుటుంబం బీజేపీపై విమర్శలు చేస్తోందని,
దాడులు జరుగుతాయని మాకు తెలుసు… ప్రజాస్వామ్య పరిరక్షణలో మేము ముందుకు పోతామని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!