విశాఖపట్నంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. సింహాద్రి ఎన్. టి.పి.సి.ని సందర్శించనున్నారు మంత్రి కిషన్ రెడ్డి. దీంతో విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటనతో ఎయిర్ పోర్ట్ దగ్గర అప్రమత్తత కొనసాగుతుంది. నేషనల్ హైవే పైనే ప్రయాణీకుల వాహనాలు చెక్ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు విశాఖ పోలీసులు. నేటితో జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర 600రోజులకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ రిలే దీక్షలు చేరాయి. దీంతో అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నాయి కార్మిక సంఘాలు.
Read Also: Minister Mallareddy It Raids: మల్లారెడ్డి కొడుకు, కూతురు ఇళ్ళల్లో ఐటీ సోదాలు
ప్రజా పోరాటాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూటికి నూరు శాతం అమ్మాలనే ప్రతిపాదన చేసినప్పటి నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి. నరేంద్ర మోడీ సర్కారు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని కార్మికులు, ఐక్యపోరాట సమితి నేతలు పిలుపునిస్తున్నారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని వారంటున్నారు. కిషన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.