సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడు వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ జరగలేదని మండిపడ్డారు.
బంగారు తెలంగాణగా మారుస్తానని.. సీఎం కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ వారసిగుడ సభలో ప్రజా గోస - బీజేపీ భరోసా శక్తి కేంద్రాల్లో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలన్నారు.
హైదారబాద్ లోని తాజ్ కృష్ణ లో G-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు 9దేశాల ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించనున్నారు.
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో నేటి నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఈనేపథ్యంలో.. స్థానికులు ప్రజలు తమ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.