ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని మంత్రి పరిశీలించారు.
Harish Rao: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. సభకోసం మంత్రలు ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్రవీరయ్య, రెడ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Vande Bharat Express starts tomorrow: రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రేపు ప్రారంభం అయ్యే రైలు ఆరోదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రోటోకాల్…
పెట్రోల్, డీజిల్ ధరలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో అధికంగా ఉందని తెలిపారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలతో.. ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. నిప్పులు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని చురకలంటించారు.