చైనా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. బీజింగ్ వేదికగా అత్యంత పవర్‌ఫుల్ క్షిపణులను ప్రయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించిన గుర్తుగా 80వ వార్షికోత్సవాన్ని చైనా నిర్వహించింది.
చైనాలోని బీజింగ్‌లో భారీ ఎత్తున సైనిక కవాతు జరిగింది. బుధవారం పెద్ద అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.
చైనాలోని బీజింగ్‌లో భారీ సైనిక కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. చైనా సైనికులు నిర్వహించిన భారీ కవాతును నేతలంతా తిలకించారు.
కిమ్ నాయకత్వంపై తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అత్యంత దారుణంగా చంపేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర కొరియాలో జరిగింది. తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేశారు.
Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది.
కిమ్ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని.. ఆల్కహాల్, సిగరెట్ల వ్యసనం తీవ్రమైందని తెలిపింది. కిమ్ చికిత్స కోసం విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. కిమ్ కు అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ఔషధాలను వాడుతున్నారంటోంది దక్షిణ కొరియా.
North Korea: ఉత్తర కొరియా ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఊహకు కూడా అందవు. పాశ్చాత్య దేశాల సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూస్తే అక్కడ చాలా కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా ఉండదు. శిక్షల పరిమాణంలో తక్కువ ఉండదు. కిమ్ నిరంకుశంలో ఉత్తరకొరియా ప్రజలకు మిగతా ప్రపంచం ఒకటి…
Kim : నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్ మామ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈ సారి తన కుమార్తె కిమ్ జు యేతో సైనిక అధికారులతో చలాకీగా సమావేశమై అనుమానాలకు తెరదించాడు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అమెరికా ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా ఉత్తర కొరియా మాత్రం వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపడుతూనే ఉంది. తాజాగా రాజధాని ప్యాంగాంగ్‌కు సమీపంలోని సునన్ ప్రాంతంలో 35 నిమిషాల వ్యవధిలో 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఒక్కరోజులో ఉత్తర కొరియా ప్రభుత్వం అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. Monkey…
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన క్షిపణి ప్రయోగాలకు మరోసారి పనిచెప్పాడు. ఈ రోజు తెల్లవారుజామున వరసగా 3 క్షిపణులను ప్రయోగించాడు. క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదే లేదంటున్నాడు. ఉత్తర కొరియ క్షిపణి ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మూడు క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది నార్త్ కొరియా. ఈ విషయాన్ని సియోల్ మిలటరీ ధ్రువీకరించింది. సునమ్ ప్రాంతం నుంచి మూడు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరయి జాయింట్…