ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? నిద్రలేమి, మద్యంపై అతిగా ఆధారపడడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా? అంటే అవునని అంటుంది దక్షణ కొరియా గూఢచారి ఏజెన్సీ. కిమ్ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని.. ఆల్కహాల్, సిగరెట్ల వ్యసనం తీవ్రమైందని తెలిపింది. కిమ్ చికిత్స కోసం విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. కిమ్ కు అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ఔషధాలను వాడుతున్నారంటోంది దక్షిణ కొరియా.
Also Read : Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు
కిమ్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతనికి చికిత్స చేసేందుకు విదేశీ వైద్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. కిమ్ కు ఉన్న జబ్బును తగ్గించే ఔషధాల కోసం వెతుకుతున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ వివరించింది. అయితే కిమ్ మద్యపానం, ధూమపానం అతిగా చేయడం ద్వారా నిద్ర రుగ్మత మరింత పెరిగి.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించింది. అంతేకాకుండా కిమ్ కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఉన్నాయని.. ఇటీవల చాలా అలసిపోయినట్లుగా ఉన్నట్లు తెలిపింది దక్షిణ కొరియా.
Also Read : WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారితో ప్రమాదమంటున్న రిక్కీ పాంటింగ్
ఇన్నీ అనారోగ్య సమస్యలు ఉన్నా కిమ్.. తన అలవాట్లలో ఏం మార్పులేదని దక్షిణకొరియా నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా కిమ్ కోసం ఉత్తర కొరియా విలువైన బ్రాండ్‌ల విదేశీ సిగరెట్‌లను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటోందని దక్షిణ కొరియా అధికార పీపుల్ పవర్ పార్టీ శాసనసభ్యుడు ఒకరు తెలిపారు. ఇటీవల కిమ్ చిత్రాలను ఆర్టిఫిషీయల్ ఇంటెలిజన్స్ ద్వారా విశ్లేషిస్తే.. కిమ్ బరువు అనూహ్యంగా పెరిగినట్లు కనిపిస్తోందని దక్షిణ కొరియా అధికారి తెలిపారు. కిమ్ 140 కిలోలు ఉండొచ్చని వెల్లడించారు.
Also Read : Sachin Tendulkar : రెజ్లర్ల ఉద్యమంపై సచిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
మరోవైపు ఉత్తర కొరియాలో ఫిబ్రవరిలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. దానికి కారణం కిమ్ జాంగ్ ఉన్ నియంత పోకడలేనని అక్కడి వారు అంటున్నారు. ఆకలితో చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. నేరాలు, ఆత్మహత్యలు, ఆకలి మరణాలు ఉత్తరకొరియాలో గతంలో కంటే రెట్టింపయ్యాయని దక్షిణ కొరియా వెల్లడించింది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగం పరిస్థితులపై చర్చించారు. కిమ్ జాంగ్ దేశం కోసమా.. లేదంటే తన ప్రాణాల కోసం పోరాడుతాడో చూడాలి.