Kim : నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్ మామ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈ సారి తన కుమార్తె కిమ్ జు యేతో సైనిక అధికారులతో చలాకీగా సమావేశమై అనుమానాలకు తెరదించాడు. దేశ ప్రజలంతా ఆకలితో అలమటిస్తుంటే అణ్వాయుధాల తయారీకే ప్రాధాన్యం కల్పించారు కిమ్. అలాంటి నియంత ఎటు వెళ్లిపోయాడో అంటూ ప్రపంచమంతా రకరకాల ఊహాగానాలకు తెరదీశారు కిమ్. అనుక్షణం కిమ్ కదలికలపై నిఘా పెట్టే విదేశీ మీడియా కిమ్ కనిపించని ప్రతీసారి రకరకాల ఊహాగానాలను ప్రచారం చేస్తుంటుంది. ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఇక కోలుకోవడం కష్టమనే కథనాలను ప్రసారం చేస్తుంటుంది. ఆ ఊహాగానాలను తెరతీస్తూ ప్రత్యక్షమై అవాక్కయ్యేలా చేస్తుంటాడు. ఎవరు ఎంతలా ప్రచారం చేసినా, కిమ్ ఎప్పుడూ స్పెషలే. ఈసారీ అంతే. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అత్యున్నత సైనికాధికారుల సమావేశానికి హాజరయ్యారు కిమ్. తన భార్య, బిడ్డతో కిమ్ ప్రత్యక్షమయ్యేసరికి మరోసారి అవాక్కవడం ప్రపంచ మీడియా వంతైంది.
Read Also: Pakistan: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పాక్‌లో అడుగంటిన పెట్రోల్ నిల్వలు
కుమార్తె కిమ్ జు యే, భార్య రీ సోల్ జు తో సహా కొరియన్ ఆర్మీ జనరల్ సమావేశానికి వచ్చారు కిమ్. తొమ్మిదేళ్ల కిమ్ జు యే నార్త్ కొరియా తదుపరి అధ్యక్షురాలిగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దేశ పాలన, సైనిక వ్యవహారాల్లో సింగిల్ గా కనిపించే కిమ్ తన కుమార్తెను సైనికులకు పరిచయం చేయడం ఇది నాలుగోసారి. కిమ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ, రెండో కుమార్తె అంటేనే కిమ్ కు ఎక్కువ ప్రేమ అంటున్నారు. తండ్రి కిమ్ తో వచ్చిన కిమ్ జు యే కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది కొరియన్ సైన్యం. ప్రపంచ అత్యుత్తమ సైన్యంగా చెప్పుకునే కొరియన్ ఆర్మీ అధికారుల విందులో తండ్రి పక్కనే కనిపించింది కిమ్ జు యే. గత నవంబర్ లో కూడా తండ్రితో కలిసి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను వీక్షించింది కిమ్ జు యే. ఆ క్షణంలోనే కిమ్ కూతురిపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. తన వారసురాలిగా కిమ్ జు యేను ప్రమోట్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.