Hyderabad: కుటుంబ కలహాలు జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అన్యోన్యంగా ఉండే జీవితాల్లో చిన్న చిన్న గొడవలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని ప్రభావం పిల్లలపై పడుతుందనే ఆలోచన లేకుండా పోతుంది. చిన్న పిల్లలు అనాధలుగా మారితే వారిని చూసుకునే దిక్కులేని పరిస్థితులకు దారితీస్తాన్నాయి. కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు సహజం కానీ ఆ గొడవలు కారణంగా ఆత్మహత్యే కారణమని అనుకుంటే దాని ప్రభావం కుటుంబంపై పడుతుందనే భావన కూడా లేకుండాపోతుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని నాగోల్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగోల్ సాయినగర్ లో రాజు తన భార్య సంతోష నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులు అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. అయితే నిన్న వీరిద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త రాజు సంతోషిని అతి కిరాతకంగా హత్య చేశాడు. తరువాత అతను ఏమనుకున్నాడో ఏమో గానీ.. సరూర్ నగర్ తపోవన్ కాలనీలోని తన చెల్లిలు ఇంటికి వెళ్లి పై అంతస్తునుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రాజులు కనిపించపోయే సరికి చెల్లెలు మంజుల వెతుకుతుండగా.. బయట నుంచి కొందరు కేకలు వేశారు. ఎవరో రక్తపుమడుగులో మృతి చెందారని స్థానికులు తెలిపారు. దీంతో బయటకు వచ్చి చూడగా కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. వెంటనే రాజు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ కలహాల కారణంగానే రాజు భార్యను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. సరూర్ నగర్ తపోవన్ కాలనీలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజు చెల్లెలు మంజుల..
ఇవాళ ఉదయం మా ఇంటికి మృతుడు రాజు వచ్చాడు, కాని తలుపు కొట్టలేదు అని రాజు చెల్లెలు మంజుల తెలిపింది. నేరుగా బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకడంతో.. అది గుర్తించిన పక్కింటి వాళ్ళు మాకు చెప్పారు. దీంతో పరుగున ఇంటి బయటకు వచ్చి చూడగా. ఎవరో విగతజీవిగా పడిఉండటాన్ని చూసి షాక్ తిన్నాము. షర్ట్ ను చూసి చనిపోయింది మా అన్నగా గుర్తించానని మంజుల కన్నీరుమున్నీరయ్యింది. ఈ విషయం చెప్పాలని వదిన సంతోషకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. పక్కనే వున్న తెలిసిన వాళ్లకు కాల్ చేసి ఇంటికి వెళ్లి చూడమని చెప్పాను. తాళం వేసి ఉందని చెప్పడంతో తాళం పగలగొట్టమని చెప్పానని అన్నారు. తాళం విరగొట్టి చూస్తే లోపల రక్తపు మడుగులో వదిన సంతోష ఉందని తెలిపారు. అప్పుడు తెలిసింది, ఆ అన్నయ్య వదినను చంపి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిందని మంజుల తెలిపారు. నాలుగేళ్ళుగా మా అన్న రాజు నాతో మాట్లాడుతలేడని, సెలవులు కావడంతో ఇద్దరి పిల్లలను రాత్రి మా ఇంటి దగ్గరికి పంపించాడని అన్నారు. అయితే ఇంతలోనే ఇద్దరు చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదని వాపోయింది.
Vladimir Putin in China: చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్..