ఇన్‌స్టాగ్రామ్ ఒకరి ప్రాణం తీసింది. యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యను తానే హత్య చేశాడు. ఆదివారం పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన వారు.. కారులోనే గొడవపడ్డారు. ఆ తర్వాత తన పిల్లల ఎదుటే భార్యను హతం చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారని.. అంతేకాకుండా ఆమె తన భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.
బ్రెజిల్‌లో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా పక్కనే తండ్రి సీట్లో బీర్ తాగుతున్నట్లు కనిపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో నలుగురిని కాల్చి చంపిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తాను వారిని కాల్చిన సమయంలో సృహాలో లేనని పోలీసులకు చెప్పాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో ఘోరమైన ఘటనలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. అయితే, తాజాగా ముజఫర్‌నగర్‌లో భజన కీర్తన పాడినందుకు వివాదంలో చిక్కుకున్న ముస్లిం గాయకుడి సోదరుడు ని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఖుర్షీద్.. సింగర్ ఫర్మానీ నాజ్ కి వరుసకు తమ్ముడవుతాడని పోలీసులు పేర్కొన్నారు.
మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడిగే ఇవ్వకపోవడంతో కుమారుడు కృరంగా మారాడు.. డబ్బులు ఇవ్వడం లేదంటూ కోపంతో తల్లిని కొడవలితో కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిటలో ఇవాళ (శుక్రవారం) జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. జిల్లాలోని రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం కృష్ణ హత్యకు గురయ్యాడు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, గురువారంనాడు ఉదయం మూల్ తాలూకాలోని ఎస్‌గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించిందని.. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
వారిద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకే రూమ్లో కలిసి ఉంటున్నారు. కానీ వారి మధ్య అనుమానం అనే పెనుభూతం ఎంటరయింది. దీంతో ఒక స్నేహితునిపై మరొకతను ద్వేషం పెంచుకున్నాడు.