చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ తాజా షో కోసం…