Medicover Hospital : వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ & హార్లే డేవిడ్‌సన్ బైకర్స్ కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ACP సత్యనారాయణ వచ్చి జెండా ఊపి రైడ్ ను ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యులు కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించడంకి అభినందించాల్సిన విషయం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో…
అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని తరచుగా “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితిని నివారించడంలో, దానిని నిర్వహించడంలో అధిక రక్తపోటు కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి జన్యు పరమైన పరిస్థితులు. అధిక రక్తపోటు యొక్క కుటుంబ చరిత్ర…
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన భాగం. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
సీఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. గురువారం రోజు పలాస పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు
నమీబియా నుంచి భారత్‌కు తరలించిన ఎనిమిది చిరుతల్లో ఒకటి జనవరి నుంచి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ సోమవారం మరణించింది. సాషా రోజువారీ పర్యవేక్షణ తనిఖీలో అలసట, బలహీనంగా ఉన్నట్లు కనిపించేందు. వైద్య పరీక్షల్లో చిరుత డీహైడ్రేషన్‌కు గురైందని, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది.
High salt is a threat to heart health: మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉప్పు అనేది కీలకం. సోడియం మనశరీరంలో ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చెస్తుంది. కండరాలు, నరాల కదలికలకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే ఉప్పు శరీరానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఉప్పు అధికంగా తీసుకుంటామో అప్పుడు గుండె, కిడ్నీలు, నరాలపై ప్రభావం పడుతుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల వైఫల్యానికి, గుండెపొటుకు కారణం అవుతుంది.
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా…