బడా బడా బాబుల సంగతి ఏంటో గానీ.. సాధారణ వ్యక్తులు లోన్ అడిగితే మాత్రం.. బ్యాంకులు.. ఆ పేపర్.. ఈ పేపర్ పేర్లతో తమ చుట్టూ తిప్పుకున్న సందర్భాలు అనేకం.. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌కి వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపుతోంది.. తనకు లోన్ మంజూరు చేయకపోతే బ్యాంక్ శాఖను పేల్చేస్తా.. బ్యాంక్ ఛైర్మన్‌నే కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ ఫోన్ చేసి మరీ హెచ్చరించాడు.. తాను రూ. పది లక్షల…
Kidnap: పాకిస్తాన్ లో ఒక సీనియర్ మంత్రిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. జైళ్లో ఉన్న తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాసేపైన తరువాత విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన సీనియర్ మంత్రి అబైదుల్లా బేగ్‌ను శనివారం మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆయన సహచరులను కూడా తీసుకువెళ్లారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఉగ్రవాదులతో చర్చల అనంతరం శనివారం మంత్రి అబైదుల్లా…
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి కి చెందిన శంకరయ్య ముంబయి విమానాశ్రయం నుండి బయటికి వస్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. జూన్ 22న కిడ్నాప్ గురయ్యాడు. అయితే తనను వదిలిపెట్టాలంటే 15లక్షలు డిమాండ్ చేస్తూ.. శంకరయ్య కాళ్లు చేతులు కట్టేసి ఉన్న ఫొటోను ఆయన కుమారుడు హరీష్‌కు వాట్సాప్ చేశారు. అంతేకాకుండా.. ఆ డబ్బు మొత్తం ఇవ్వాల్సిందేనని.. ఎక్కడికి తెచ్చి ఇస్తారో చెప్పాలని హరీష్‌కు ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కిడ్నాపర్లు.…
జూబ్లీహిల్స్ లో.. జరిగిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఇంకా కొలిక్కిరాలేదు. ఆకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రమంతా దీనిపైనే ఫోకస్ పెట్టింది. దీంతో.. పబ్బులపై పోలీసులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లో వెలితే..హైదరాబాద్ లోని మొగల్ పురా పోలీస్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. రోజు సమయానికి ఇంటివచ్చే కుమార్తె…
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్ధన్ రాయల్‌గా పోలీసులు వెల్లడించారు. కాగా ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి…
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న అర్దరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అయితే నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా (60) రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో ఓ వివాహానికి షేక్ గుయోష్ పాషా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో షేక్ గుయోష్ పాషా తిరిగి ఇంటికి వెళుతుండగా,…
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆచూకీ భీమవరంలో లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్ధినిని కిడ్నాపర్ భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుంచాడని తేలింది. కిడ్నాపర్‌ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు భీమవరం మండలం కొత్త పూసలుమర్రుకి చెందిన ఫణీంద్ర. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని యువతిని నమ్మించాడు ఫణీంద్ర. ఆమెను భీమవరం బలుసుమూడి లో ఒక రూమ్ లో నిర్బంధించాడు.…