నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న అర్దరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అయితే నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా (60) రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో ఓ వివాహానికి షేక్ గుయోష్ పాషా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో షేక్ గుయోష్ పాషా తిరిగి ఇంటికి వెళుతుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారు లో ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే షేక్ గుయోష్ పాషా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ జరిగిన సంఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కిడ్నాప్ ను ఛేదించడానికి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. గుయోష్ పాషా కు వ్యాపారంలో ఎవరితోనైనా గొడువలున్నాయా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.