జూబ్లీహిల్స్ లో.. జరిగిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఇంకా కొలిక్కిరాలేదు. ఆకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రమంతా దీనిపైనే ఫోకస్ పెట్టింది. దీంతో.. పబ్బులపై పోలీసులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
ఇక వివరాల్లో వెలితే..హైదరాబాద్ లోని మొగల్ పురా పోలీస్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. రోజు సమయానికి ఇంటివచ్చే కుమార్తె ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రుల మొగల్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మరుసటి రోజే ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. ఆ బాలికను పోలీసులు విచారించగా.. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఓ..ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చిన పోలీసులు వెంటనే లుక్మాన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామానికి తీసుకెళ్లానని, అక్కడ తనకు తెలిసిన వ్యక్తులు తమకు ఆశ్రయమిచ్చారని పోలీసు విచారణలో లుక్మాన్ వెల్లడించాడు. వెంటనే లుక్మాన్ కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి కారణమేంటి, అసలు ఆరాత్రి కొందుర్గ్ ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాగా.. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. పోలీసులు వివరాలను గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అనే విషయం ప్రతిఒక్కరికి ప్రశ్నార్థకంగా మారింది.