Vikarabad: పాల ప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లిన బాలుడికి మత్తుమందు ఇచ్చి గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌కు యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్‌లో చోటుచేసుకుంది. తాండూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని మజీద్ దగ్గర రెహన్ అనే (16) బాలుడికి ముఖం దగ్గర మత్తు ఇచ్చారు గుర్తు తెలియని దుండగులు. స్పృహ కోల్పోయిన బాలుడిని అక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
Read Also: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాలుడు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో బాలుడిపై రాళ్ల దాడికి దిగి… బాలుడు దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కెళ్లారు దుండగులు. ఎలాగోలా వారి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి స్థానికులను ఆశ్రయించాడు బాలుడు రెహాన్. గాయాల పాలైన బాలున్ని తాండూర్ ప్రభుత్వ స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన దుండగుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.