Andhra Pradesh Crime: వీడు ఉపాధ్యాయుడేనా..? స్కూల్ నుంచి విద్యార్థిని కిడ్నాప్, తాళికట్టి అత్యాచారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. పాఠాలు నేర్పాల్సిన గురువు.. ప్రేమ పాఠాలు బోధించాడు.. తాను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.. ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పంది.. ఆ తర్వాత వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..
Read Also: Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం.. మళ్లీ నిలిచిపోయిన పనులు
Also Read
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.. విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉన్న అతడి కన్ను ఓ విద్యార్థినిపై పడింది.. 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు.. అంతేకాదు.. స్కూల్ నుంచి ఈ నెల 19వ తేదీన విద్యార్థినిని తన బైక్‌పై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లాడు.. అక్కడే ఆ బాలికకు తాళి కట్టి పెళ్లైందని చెప్పాడు.. అంతటితో ఆగకుండా.. తనలోని పశువును నిద్రలేపాడు.. తాళికట్టి పెళ్లి అయిపోయిందని చెప్పి.. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్. మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె సత్యనారాయణ వివరించారు.
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!