Badradri: ఎన్నికల వేళ 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన దాదాపు 25 మంది వ్యాపారస్తులు బుధవారం ఉదయం 7 గంటలకు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో నిర్వహిస్తున్న వారాంతపు మార్కెట్‌కు ఆటోలు, బైకుల్లో బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులోని తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులు వారు వెళ్తున్న వాహనాలు అడ్డుకుని వ్యాపారులను దించేశారు. ఆటోలు, వాహనాల్లోంచి నిత్యావసర వస్తువులు, మద్యం సీసాలు బయటికి విసిరి పారేశారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. వీరిలో కొందరు మహిళా వ్యాపారులు కూడా ఉన్నారు.
Read Also:Election Ink: ఎన్నికల ‘సిరా’ తయారు చేసేది ఎక్కడో తెలుసా?
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని..నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని, సొంత వ్యాపారం చేసుకుంటున్నామని మమ్ములను వదిలేయమని వేడుకున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తామని బెదిరించారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు తమ వాహనాల్లో పోలీసులకు సరుకులు తీసుకెళ్తున్నారు. ముందుగా వెళ్లిన వారిని మావోయిస్టులు అపహరించుకుపోయారని గ్రహించిన వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. గమనించిన మావోయిస్టులు వారిని వెంబడించారు. కానీ వారు మావోయిస్టుల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడి గాయపడ్డారు. పరారైన ఇద్దరు వ్యాపారులు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారారని.. వాళ్ల గనుక తమకు దొరికితే చంపేస్తామని మావోయిస్టులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో సంత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
Read Also:Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న వెంకటేష్, చిరంజీవి!
తాజావార్తలు
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!