Kia: కార్ల అమ్మకాల్లో దుమ్ము రేపుతున్న కియా కార్లు.. జూన్ నెలలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరియన్ కార్ల తయారీ సంస్థ ‘ కియా ’ ఇండియాలో అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఎన్నడూ లేని విధంగా ఏడాది తొలి అర్థభాగంతో పాటు జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసిందని కియా ఇండియా ప్రకటించింది. జూన్ నెలలో ఏకంగా 24,024 యూనిట్ల కార్లను విక్రయించింది. 2021లో ఇదే నెలలో 15,015 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపుగా 10 వేల యూనిట్లను అదనంగా విక్రయించింది. దాదాపు 60 శాతం గ్రోత్ నమోదు చేసింది. కియా కాంపాక్ట్ ఎస్ యూ వీ సెల్టోస్ కార్ అన్నింటి కన్నా ఎక్కువగా అమ్ముడుపోయింది. ఏకంగా 8388 యూనిట్ల విక్రయం జరిగింది. ఆ తరువాతి స్థానాల్లో కారెన్స్ 7895 యూనిట్లతో, సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ సోనెట్ 7455 యూనిట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక క్యాలెండర్ ఫస్ట్ హాఫ్ లో ఏకంగా 1,21,808 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఏడాది తొలి భాగంలో 26 శాతం గ్రోత్ నమోదు చేసింది. వీటిలో కియా సెల్టోస్ 48320 యూనిట్లు, సోనెట్ 40,687 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ సమస్యలు ఉన్నప్పటికీ మేము ఈ రికార్డును సాధించామని కియా ఇండియా వైస్ ప్రెసిడెండ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు. మా మోడల్స్ పై వినియోగదారులు నమ్మకం పెట్టుకున్నారని.. వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉన్నా.. వీలైనంత త్వరగా మా కస్టమర్లకు కార్లను డెలివరీ చేస్తున్నామని వెల్లడించారు.
Also Read
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
Read Also: Naresh Pavithra Lokesh: పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయిన రమ్య
కియా తాజాగా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా తన కొత్త మోడల్ ఈవీ 6 కార్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈవీ 6 కార్ బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. దాదాపుగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండటంతో దీన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. సెప్టెంబర్ నెలలో డెలవరీ ప్రారంభిస్తామని కియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?