సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో కార్లపై భారీ ఆఫర్లు ఉంటాయి.. ఆ తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వివిధ సంస్థలు.. వాటి కార్ల ధరలను పెంచడం చూస్తూనే ఉన్నాం.. అంటే, డిసెంబర్‌లో కొంటే.. సాధారణ ధరకంటే తక్కువకే కారు తీసుకునే అవకాశం ఉండగా.. క్యాలెండర్ మారిందంటే.. జేబుకు చిల్ల పడడం ఖాయం అన్నమాట.. తాజా, వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను పెంచనున్నట్టు చెబుతోంది.. జనవరి 23వ తేదీ నుంచి కార్ల ధరలను పెరుగుతాయని.. మోడల్‌ను బట్టి ధర రూ.30,000 వరకు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.. జనవరి 2023 నుంచి తమ వాహనాల ధరలను పెంచాలని హోండా యోచిస్తోంది.. టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా మరియు ఎమ్‌జీ మోటార్ కూడా వచ్చే ఏడాది నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటనలు చేసిన విషం విదితమే..
Read Also: Harish Rao : వీటికి జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలి.. కేంద్రంను కోరిన హరీష్‌రావు
మొత్తంగా వచ్చే నెల నుంచి హోండా వాహనాల ధరలను పెంచనుంది.. ఈ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను జనవరి నుండి పెంచాలని యోచిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. పెంపు మొత్తం రూ.3,000 వరకు ఉంటుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి మరియు రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాలను సిద్ధం చేయడానికి ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు వాహన తయారీదారులు తెలిపారు… హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ మాట్లాడుతూ.. ముడి పదార్థాల ఇన్‌పుట్ ధర మరియు రాబోయే నియంత్రణ అవసరాలలో స్థిరమైన పెరుగుదలను అంచనా వేసిన తర్వాత, మేం జనవరి 23 నుండి మా ఉత్పత్తులకు ధరలు సవరిస్తాం.. అది రూ. 30,000 వరకు ఉంటుంది.. వివిధ మోడల్స్‌ను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయని తెలిపారు..
ఇక, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, హీరో మోటోకార్ప్, ఇతర కార్ల శ్రేణి ధరలను పెంచిన తర్వాత హోండా కూడా ఈ నిర్ణయానికి వచ్చింది.. హీరో మోటోకార్ప్ డిసెంబర్ 1 నుండి ధరలను పెంచగా, మారుతీ సుజుకీ మరియు హ్యుందాయ్ జనవరి నుండి ధరలను పెంచాలని యోచిస్తున్నాయి.. టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా మరియు ఎమ్‌జీ మోటార్ కూడా వచ్చే ఏడాది నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటనలు చేశాయి. బీఎస్-VI ఉద్గార నిబంధనల యొక్క రెండవ దశ ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వస్తుంది. వాహనాలు ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా కలిగి ఉంటాయి, ఇవి పెట్రోల్ ఇంజిన్‌లోకి ఇంజెక్ట్ చేయబడిన సమయం మరియు ఇంధన మొత్తాన్ని నియంత్రిస్తాయి.. ఇవి కూడా ధరల పెంపుపై ప్రభావాన్ని చూపనున్నాయి. మొత్తంగా.. కారు కొనాలంటే.. డిసెంబర్‌లోనే కొనేయండి.. లేకపోతే జేబుకు చిల్లు తప్పదన్నమాట..