Khammam: తడి చేతులతో సెల్ ఫోన్‌కు ఛార్జింగ్.. విద్యుత్ షాక్‌తో బాలిక మృతి
- తడి చేతులతో సెల్ ఫోన్‌కు ఛార్జింగ్..
- విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలిక మృతి..
- ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam: పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్లు వాడేస్తున్నారు.. ఛార్జింగ్ అయిపోతే.. ఇంట్లో ఉన్న పిల్లలకు ఫోన్ ఇచ్చి.. ఛార్జింగ్ పెట్టు అని పురమాయిస్తూ ఉంటారు.. అలాంటి వారు కాస్త ఆలోచన చేయాలి.. ఎందుకంటే.. సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతూ.. బాలిక మృత్యువాతపడింది.. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
Read Also: Deputy CM Pawan Kalyan: ఏనుగుల నుంచి రక్షణకు చర్యలు.. ‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటకతో చర్చలు..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది.. ఆ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, అప్పుడే టాయ్‌లెట్‌కి వెళ్లి వచ్చిన ఆ బాలిక.. తన తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. చిన్నారి చేతులు తడిగా ఉండటంతో కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వం పాఠశాలలో 4 వ తరగతి చదువుతుంది. 8 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు అయినా.. పెద్దవాళ్లు అయినా.. చార్జింగ్ పెట్టేటప్పుడు.. చేతులు తడిగా లేకుండా చూసుకోవడం మంచిది.. అసలే వర్షాకాలం కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఉంటే మేలు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!