గత రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్యలు చేసిన ఘటన ఎట్టకేలకు హత్య మిస్టరీ వీడింది. రఘునాథపాలెం మండలం హర్యా తండా వద్ద తల్లి ఇద్దరు పిల్లలతో కారు ప్రమాదం భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందిన ఘటన కనపడింది. అయితే భర్త ప్రవీణ్ హైదరాబాదులో డాక్టర్గా పనిచేస్తూ అక్కడ ఒక కేరళ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నడని ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇంటికి భార్య పిల్లల్ని తీసుకుని వచ్చి కారుని ఒక చెట్టుకు ఢీకొట్టే విధంగా చేశాడు భర్త ప్రవీణ్. అప్పటిలో ఇది పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే భావించారు.
Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
హత్య చేశారని భార్య బంధువులు ఆరోపించినప్పటికీ ఇది రోడ్డు ప్రమాదం కానే పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. మీడియా సమావేశాలు కూడా ఇదే వెల్లడించారు. అయితే పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ భార్య బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పలు దఫాలుగా ధర్నా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్క్లూజివ్ గా ఆనాడు ఎన్టీవీ వెలుగులోకి చూపెట్టింది. ఇది హత్య అంటూ ఎన్ టీవీ స్పష్టం చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి హత్యగా నిర్ధారణ అయినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. భార్యని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా భర్తకు మాత్రం గాయాలు అయ్యాయి. దీంతో భర్త పైన అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటిలో భర్త ప్రవీణ్ ను ప్రైవేట్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. చివరికి పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలింది. దీనికి సంబంధించి వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. గంట నుంచి ఎడతెరిపి లేని వాన
45 రోజుల తరువాత మిస్టరీ వీడిందని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ ను అరెస్టు చేశామన్నారు, భార్య ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్.. అనంతరం కార్ ఆక్సిడెంట్ గా క్రియేట్ చేశాడన్నారు. నర్స్తో అక్రమ సంబంధంతో ఈ ఉదంతానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కారులో ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని.. అందులో ఖాళీ సిరంజి దొరికిందన్నారు. అనస్థీషియా సిరంజి ఇచ్చి హత్య చేసినట్లుగా స్పష్టం అయ్యిందని ఏసీపీ పేర్కొన్నారు. మే నెలలో ఇంటిలో గొడవ జరిగిందని.. అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రుల మధ్య పంచాయితీ కూడా జరిగిందని తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చి చంపాలని ప్రయత్నాలు చేశారని.. కాల్షియం ఇంజెక్షన్తో హత్య చేయడం కోసం ప్లాన్ చేశారని.. కుదరలేదని ఏసీపీ తెలిపారు. భోజనం చేసి ఖమ్మం నుంచి కోయచెలక దారిలో కాల్షియం ఇంజెక్షన్, మరో ఇంజెక్షన్ కలిపి ఇచ్చాడన్నారు. భార్య నిద్ర పోగానే పిల్లలకు ఇంజెక్షనిచ్చి హత్య చేశాడని.. హర్య తండా వద్ద చెట్టుకు ఢీ కొన్నట్లు క్రియేట్ చేశాడని ఏసీపీ పేర్కొన్నారు.