మరికొన్ని రోజుల్లో ఆ యువకుడికి పెళ్ళి.. కుటుంబీకులందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.. అంగరంగ వైభవంగా పెళ్ళి నిర్వహించాలని రంగం సిద్ధం చేస్తున్నారు.. కానీ ఇంతలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఆ యువకుడ్ని బలి తీసుకుంది. పెళ్ళి పీటలు ఎక్కాల్సిన తమ అబ్బాయి.. పాడె ఎక్కాల్సి వచ్చిందంటూ కుటుంబీకులు భోరమంటూ విలపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అల్లిపురానికి చెందిన గట్ల నవీన్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళ క్రితం…
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఎన్జీఆర్ విగ్రహ ఆవిష్కరణలు, ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాళలతో ఘనంగా నివాళులర్పింస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీ లో పాల్లొని R&B గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసారు. ఒకే బైక్…
ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి…
ఖమ్మం పార్లమెంటుకు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచరులను పెట్టుకున్నారు. అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తారు ఈ మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి పాత్రపై రకరకాలుగా ప్రచారం జరిగింది. క్రాస్ ఓటింగ్ వెనక పొంగులేటి ఉన్నట్టు సీఎం కేసీఆర్‌కు నివేదికలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు పార్టీ పదవులు..…
పద్మశ్రీ రామయ్య చెట్లకు నీళ్లు పోయడానికి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు . ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి కి చెందిన వనజీవి రామయ్యకు ఉదయం లేచిన వద్ద నుంచి నీళ్లు పోయడం చెట్ల పొదల్లో తుపాలను తొలగించడం, ఎర్రచందనం, చింత చెట్ల గింజలను ఏరుకుని వాటిని మళ్ళీ నాటడం అలవాటు. ఎనిమిది పదుల వయసులో కూడా పద్మశ్రీ రామయ్య తాను నాటిన చెట్లను జాగ్రత్త గా చూసుకోవడం అలవాటుగా మారింది. అదేవిధంగా ఇవాళ…
ఖమ్మం జిల్లా కేంద్రం ఇప్పుడు రాజకీయ వైరానికి కేంద్రంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం తార స్థాయికి చేరింది. అయితే పోలీసులు ఒక్క పక్షానికే అనుకూలంగా ఉంటున్నారని ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిరసనలకు దారి తీస్తున్నాయి. అధికార పక్షం ప్రతిపక్షంకు చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేస్తే లేని అభ్యంతరాలు బీజేపీ మాత్రం అధికార పార్టీకి చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేయనీయకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల వైఖరితో వైరం ఇంకా…
తెలంగాణలో ఒక సంఘటన అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకుని నెల రోజులు అయినప్పటికి ఇంకా సాయి మృతి అధికార పార్టీని వదలిపెట్టడం లేదు. సాక్షాత్తు బీజేపీ జాతీయ నాయకుల వద్ద నుంచి రాష్ర్ట నాయకుల వరకు గణేష్ ఆత్మహత్య వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అటు అమిత్ షా వద్ద నుంచి ఇటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వరకు సాయి గణేష్ ఆత్మహత్య…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం, బొల్లోరిగూడెం, నట్రాజ్ సెటర్లలోని పలువురు వ్యాపారుల నివాసాలపై సీసీఎస్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై పుల్లయ్య సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. అనంతరం సీసీఎస్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై పుల్లయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. గుడివాడ చంద్రశేఖర్ వద్ద లెక్కించే యంత్రం, రూ.1,26,560, మంచికంటి సత్యనారాయణ వద్ద నూ.4 లక్షలు, ప్రామిసరీ నోట్లను , పాల్వంచ పట్టణ…
రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. బీసీలకు చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75ఏళ్లలో ఏ.. ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన…
యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రులు అని తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ రూ.లక్షల విలువ చేసే సొత్తును దోసుకెళుతున్నారు. ఎండాకాలం ఆరుబయట నిద్రిస్తున్న వారే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగేం గ్రామంలో ఎండాకాలం రాత్రి పుట ఆరుబయట నిద్రిస్తున్న అండాలు అనే మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు.…