ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఎన్జీఆర్ విగ్రహ ఆవిష్కరణలు, ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాళలతో ఘనంగా నివాళులర్పింస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బైక్ ర్యాలీ లో పాల్లొని R&B గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసారు. ఒకే బైక్ పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎన్.టి.ఆర్.శత జయంతి వేడుకల్లో పాల్గొన్నడం అందరిని ఆకర్షించింది. సత్తుపల్లి పట్టణం ఎన్.టి.ఆర్.విగ్రహనికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు.
అనంతరం రామన్నపాలెం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి NTR విగ్రహాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళవేసి నివాలులర్పించారు. కేకే కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చిన దేవుడు NTR అని అన్నారు. ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం అని అన్నారు. సినిమా రంగమైనా, రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
Nara Lokesh : చెత్తపై పన్ను వేసేవాడిని చెత్త నాకొడుకు అంటాం..