శుభమా అని కెటీఆర్ వస్తానంటే…ఆయనేదో మర్యాదగా భోజన ఏర్పాట్లు చేస్తానన్నారు…కానీ, ఆ విందు ఏర్పాట్లే సమస్యగా మారతాయని ఊహించి ఉండరు..ఇంత మంది పార్టీ నేతలు కాదంటున్న వరుసలో…కెటీఆర్ మాత్రం భోజనానికి కూర్చుంటారా ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి..పార్టీ వర్గాలు.. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో కెటీఆర్ అడుగుపెట్టేదెపుడో మరి..? విందుభోజనమే కెటీఆర్ టూర్ వాయిదాకు కారణమ ఖమ్మం గులాబి నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయా? ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కెటిఆర్ పర్యటించాల్సి ఉంది.…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చినవారు, టీఆర్ఎస్ పార్టీలోనే వున్నవారు అనే రెండు వర్గాలు ఆధిపత్యం కోసం తపిస్తుంటాయి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేను పార్టీ మారుతున్నాననేది అవాస్తవం అని కొట్టి పారేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లి లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.…
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఒకవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతుంటే.. బీజేపీ నేతలు పాదయాత్ర చేయడాన్ని భట్టి తీవ్రంగా ఆక్షేపించారు. బండి సంజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఎవరి కోసం సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నావా..? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లోకి…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు…బాధల తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం. ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి? https://ntvtelugu.com/anchor-anasuya-fires-on-netizen/ ఎన్నికలప్పుడు గారడీ మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి? మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు వైఎస్ షర్మిల.…
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్లు చేశారు. చిల్లర వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు..ఓపిక పడితే రాజులు అవుతారు అన్నారు తుమ్మల. రాజకీయాల్లో కావలసింది ఓపిక… ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారన్నారు. అందువల్ల కార్యకర్తలు ఓపిక తో వ్యవహరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో కార్యకర్తల తో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నుద్దేశించి వ్యాఖ్యానించారు. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, అయితే మనం…
పినపాక గులాబీ తోటలో వరసగా ఢిష్యూం ఢిష్యూమ్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీల మధ్య తలెత్తిన విభేదాలు రకరకాలుగా మలుపులు తీసుకుంటోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికారపార్టీ నేతల మధ్య ఏ విషయంలో అగ్గి రాజుకుంది? కేసులకు, రాళ్ల దాడులకు వెరవడం లేదుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక. కొద్దిరోజులుగా ఇక్కడ టీఆర్ఎస్ రాజకీయాలు వాడీవేడీగా ఉంటున్నాయి. ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది పరిస్థితి. అధిపత్య రాజకీయాలు సెగలు…
వారిద్దరు ఉపాధ్యాయులే. తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుదు నమ్మించి, బెదిరించి మరో ఉపాధ్యాయురాలిని మోసం చేసి అత్యాచారం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న బానోతు కిషోర్ అదే మండలంలో మరో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి, తనతో పాటు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గత కొద్దికాలంగా మౌనంగా వున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి పోలేదు. నివురు గప్పిన నిప్పులా కాచుకుని ఉన్నా అన్నారు. గ్రూపు రాజకీయాలు వద్దనే నేను సైలెంట్ గా ఉన్నాను. నా కంటే బెటర్ గా చేస్తారని వెయిట్ చేశాను. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేతలు ఉన్నారు. గెలిచినా, ఓడినా నేను ఖమ్మం ఆడ బిడ్డగానే ఉంటానన్నారు. నాకు పదవులు ముఖ్యం…
ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఆకాశాన్నంటిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనలేరు.. తినకుండా వుండలేరు. బంగారం దొంగతనం చూశాం, డబ్బులు దొంగతనం చూశాం, విలువైన వస్తువులు కోసం దొంగతనాలు చూశాం. కానీ చికెన్ రేట్లు పెరగడంతో కోళ్ల దొంగతనం చేసిన ముగ్గురు యువకుల కథ ఇది. బైక్ పై వచ్చి దర్జాగా దొంగతనం చేసుకొని ఉడాయించారు. గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగులు రాత్రి సమయంలో చికెన్ దుకాణాలను టార్గెట్ చేశారు.…
అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితులు. అలాగని అన్నీ వదులుకుని రావడం సుతరామూ ఇష్టం వుండదు కొందరికి. వరద ప్రాంతాలైనా.. వార్ ప్రాంతాల్లోని వారికైనా ఇది సహజం. యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ నుండి తన పెంపుడు పిల్లితో సహా హైదరాబాద్ చేరుకున్నాడో యువకుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ ఉక్రెయిన్ లో వుంటున్నాడు. తన పిల్లికి వీసా, టికెట్ తీసుకుని విమానంలో సొంత గడ్డకు చేరుకోవటంతో అది…