ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు. గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తూ.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. మధ్య మధ్యలో జనాలతో మాట్లాడుతూ యాత్ర సాగుతోంది. ఇదే సమయంలో షర్మిల మరో విధంగానూ చర్చల్లోకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేస్తారని.. ఇందుకు ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారన్నది ఆ చర్చ సారాంశం. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలోనూ ఇలాంటి ప్రచారం సాగినా.. ఇప్పుడు మాత్రం మరింత…