తెలంగాణలో ఒక సంఘటన అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకుని నెల రోజులు అయినప్పటికి ఇంకా సాయి మృతి అధికార పార్టీని వదలిపెట్టడం లేదు. సాక్షాత్తు బీజేపీ జాతీయ నాయకుల వద్ద నుంచి రాష్ర్ట నాయకుల వరకు గణేష్ ఆత్మహత్య వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అటు అమిత్ షా వద్ద నుంచి ఇటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వరకు సాయి గణేష్ ఆత్మహత్య…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం, బొల్లోరిగూడెం, నట్రాజ్ సెటర్లలోని పలువురు వ్యాపారుల నివాసాలపై సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. అనంతరం సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. గుడివాడ చంద్రశేఖర్ వద్ద లెక్కించే యంత్రం, రూ.1,26,560, మంచికంటి సత్యనారాయణ వద్ద నూ.4 లక్షలు, ప్రామిసరీ నోట్లను , పాల్వంచ పట్టణ…
రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. బీసీలకు చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75ఏళ్లలో ఏ.. ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన…
యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రులు అని తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ రూ.లక్షల విలువ చేసే సొత్తును దోసుకెళుతున్నారు. ఎండాకాలం ఆరుబయట నిద్రిస్తున్న వారే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగేం గ్రామంలో ఎండాకాలం రాత్రి పుట ఆరుబయట నిద్రిస్తున్న అండాలు అనే మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు.…
తెలంగాణ అంతటా ఒకతీరు… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకతీరు. ఖమ్మం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. మళ్లీ తాజాగా ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఆయనను గులాబీ అధినేత పెద్దల సభకు పంపుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎంవో నుంచి కాల్ వచ్చిందని పదవి ఇస్తామని చెప్పినట్లుగా .. ఇక నామినేషన్ వేయడమే తరువాయి అని అంటున్నారు. నామినేషన్ తేదీ.. నామినేషన్…
కాదేదీ మోసానికి అనర్హం. బ్యాంకుల పేరు చెప్పి.. ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేవారు ఒకరైతే ఓటీపీ నెంబర్లతో ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టేవారు మరికొందరు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలకు కూడా కేంద్రంగా మారుతోంది. కొంత మంది తెలివిగల వారు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నకిలీ ఫోన్ పే రంగంలోకి వచ్చింది. వస్తువు కొన్న తరువాత మీ అక్కౌంటులోకి డబ్బులు వచ్చినట్లే చూపిస్తాయి. కానీ డబ్బులు మాత్రం రావు..ఇది నకిలీ…
తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయ్. గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్‌తో రెండు వ్యవస్థల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్‌భవన్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు మంత్రులు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో పరిస్థితి వేడెక్కిందని పరిశీలకు భావిస్తున్నారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యలపైనే కాకుండా.. మెడికల్ సీట్ల రగడపైనా నివేదిక కోరారు గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి…
సర్ఫ్ ఎక్సెల్.. యాడ్ లో మరక మంచిదేనంటారు. అక్కడ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు రావాలంటే మరక ఉండాల్సిందేనంట. మరక ఉంటే మాత్రం వారికి మంచి పోస్టింగ్ పక్కానట. లేకపోతే ప్రమోషన్లుండవు… డిమోషన్లేనట. అందుకే ఆ నేతలు చెప్పినట్లుగా ఎవ్వరి మీద పడితే వారి మీద, అవసరం ఉన్నా లేకపోయిన కేసులు పెడుతున్నారట. కొందరు పోలీసుల్లో ఎందుకీ విపరీత ధోరణి? మరక కోసం ఆ జిల్లా రక్షకభటుల ఆరాటం విమర్శలపాలవుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు కొందరు,…
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్.. ఇక, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక,…