Telugu Desam Party: తెలంగాణలో డీలా పడ్డ టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాస్త బలం ఉన్న ఖమ్మం వేదికగా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 21న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ గ్రౌండ్‌లో టీడీపీ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు.…
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్‌లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పరస్పరం ఆధిపత్య పోరాటం కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్సే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న వనమా…
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ…
ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గంజాయి మొక్కలను గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గ్రామానికి చెందిన పాండ్ల శ్రీరాములు తన ఇంటి ఆవరణములో నాలుగు గంజాయి మొక్కలను సాగు చేసుకుంటున్నాడు ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్దరాత్రి దాడి