ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్లతో గులాబిమయమైంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.
Harish Rao: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. సభకోసం మంత్రలు ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్రవీరయ్య, రెడ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Minister Harish Rao criticizes BJP: బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. ఈనెల 18న ఖమ్మంలో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం ఇల్లందులో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బీజేపీలో చేరితే వారు రాజకీయాలకు దూరం అయిపోయినట్లే అని, వారికి రాజకీయ భవిష్యత్తు…
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు…
రాబోయే రాజకీయ చందరంగం కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దంగా ఉన్నానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి దయతో నా మీద ఉన్న మీ ప్రేమ వట్టిగా పోదు ప్రజలు ఏం కురుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తాను అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లు ప్రాధన్యత సంతరించుకుంది.