Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మొత్తం 16 జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అన్ని జిల్లాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ నాయకులు, అభ్యర్థులు నామినేషన్లు వేయడంలో పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలు…
Minister Tummala: ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేవాళ్లు అన్నారు.
Alcohol Addiction: మద్యం.. మనుషులను కిరాతకులుగా మార్చేస్తోంది. కొంత మందికి మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. సొంతవాళ్లు.. పరాయి వాళ్లు అని తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో మద్యం మత్తులో సొంత వారినే ఇద్దరు వ్యక్తులు కడతేర్చారు. కేవలం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా ఇద్దరి ఉసురు తీశారు. రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. అలాంటి వారు మద్యం కొనాలంటే…
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని.. మహిళను గొడ్డలితో నరికి చంపాడు రవి అనే వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని ఖానాపురం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో కిటికీలు తయారు చేసే ఓ కంపెనీ లో బానోత్ రుక్మిణీ, రవిలు పని చేస్తున్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అన్నం తింటుండగా కూర వేయమని రవి రుక్మిణీ నీ అడిగాడు. రుక్మిణీ తనకు సరిపోను కూర మాత్రమే…
ఖమ్మం జిల్లాలోని తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. యువతి కోళ్లపూడి రమ్య ఇప్పటికే పెళ్లైన అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ప్రేమ పేరుతో వైజాగ్ తీసుకెళ్లాడు. పదిహేను రోజులపాటు అక్కడే గడిపారు. ఆ తర్వాత యువతిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు వివాహితుడు నరేష్. యువతి ఎన్నిసార్లు ఫోన్ చేసిన నరేష్ స్పందించలేదు. దీంతో మనస్థాపానికి గురైన యువతి వైజాగ్ లాడ్జిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.…
పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో ప్లేట్ ఫిరాయించాడు. వాడు చేసిన నికృష్టపు పనికి.. వధువు.. పెళ్లి కాక ముందే తనువు చాలించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సీతారాంపురంలో జరిగింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి సంతోషంగా జీవిస్తుందనుకున్న కూతురు.. విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బిచ్చ. అమ్మాయిలతో ఆడుకోవడంలో ఆరితేరిన మృగాడు. ఇంకా చెప్పాలంటే కిరాతకుడు. ఇతడు పెట్టే టార్చర్ మామూలుగా…
Satthupalli Robbery: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. ముసుగులు ధరిస్తారు… అందిన కాడికి దోచుకుని పరారవుతారు. మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చారంటే.. అంతే చంపడానికి కూడా వెనుకాడరు. అలాంటి కంతీ దొంగలు ఖమ్మం జిల్లాలో తిష్ట వేశారు. అర్థరాత్రి రోడ్ల మీద మారణాయుధాలతో తిరుగుతున్నారు. సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. Cheating Gang: మాయ మాటలు విన్నారో.. బురిడీ కొట్టించి దొరికిన సొమ్ముతో చెక్కేస్తారు.. జాగ్రత్త సుమీ! ఖమ్మం జిల్లాలో…
ఆ నియోజకవర్గంలో గులాబీ కేడర్ బలంగానే ఉన్నా…. నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ… కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో…లోకల్‌గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా…
బాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నిందితులపై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేస్తుంటారు. తాజాగా ఓ మహిళపై పోక్సో కేసు నమోదైంది. మహిళపై పోక్సో కేసు నమోదవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయానికి వస్తే.. ఓ మహిళ మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకుని అతడిని తీసుకుని పారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళ పై పోక్సో కేస్ నమోదు చేశారు…