Satthupalli Robbery: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. ముసుగులు ధరిస్తారు… అందిన కాడికి దోచుకుని పరారవుతారు. మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చారంటే.. అంతే చంపడానికి కూడా వెనుకాడరు. అలాంటి కంతీ దొంగలు ఖమ్మం జిల్లాలో తిష్ట వేశారు. అర్థరాత్రి రోడ్ల మీద మారణాయుధాలతో తిరుగుతున్నారు. సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Cheating Gang: మాయ మాటలు విన్నారో.. బురిడీ కొట్టించి దొరికిన సొమ్ముతో చెక్కేస్తారు.. జాగ్రత్త సుమీ!
ఖమ్మం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి ముసుగులు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. వారి చేతిలో మారణాయుధాలు కూడా ఉంటున్నాయి. ఎవరైనా అడ్డు వస్తే చంపేసేందుకు కూడా వెనుకాడరని వారిని చూస్తే స్పష్టమవుతోంది. ఇక్కడ చూడండి.. అర్ధరాత్రి దోపిడీ దొంగలు వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది ఈ ఘటన. మాస్కులు ధరించి భయానకంగా వస్తున్న దృశ్యాలు చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: మిడ్ రేంజ్‌లో బ్యాటరీ, కెమెరా, పనితీరు.. ఎవరిదీ పైచేయి?
సత్తుపల్లిలో పగలంతా ఈ దొంగలు రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. తాళం వేసి ఉన్న ఇళ్లను చూసుకుని వెళ్లారు. ఆ తర్వాత రాత్రిపూట తాము రెక్కీ చేసిన ఇళ్లను దోచుకునేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటిలో అంతా వెతికి చూశారు. కానీ వారికి ఏమీ దొరకనట్లు తెలుస్తోంది. ఐతే ఆ ఇంటి వారు పెట్టుకున్న సీసీ కెమెరాల్లో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలతోపాటు వారు ఇంట్లో కలియ తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇంట్లో వస్తువులు ఏమీ దోపిడీ చేయకపోయినప్పటికీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలతో తమ భద్రత ప్రశ్నార్థకమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దోపిడీ దొంగల భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు.