ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని.. మహిళను గొడ్డలితో నరికి చంపాడు రవి అనే వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని ఖానాపురం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో కిటికీలు తయారు చేసే ఓ కంపెనీ లో బానోత్ రుక్మిణీ, రవిలు పని చేస్తున్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అన్నం తింటుండగా కూర వేయమని రవి రుక్మిణీ నీ అడిగాడు. రుక్మిణీ తనకు సరిపోను కూర మాత్రమే ఉందని చెప్పింది. దీంతో రవి కోపోద్రిక్తుడై వెనుకనుండి వచ్చి గొడ్డలితో మహిళ మెడ పై నరికాడు. దాడిలో తీవ్రగాయాలపాలైంది ఆ మహిళ. వెంటనే స్పందించిన స్థానికులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. నరికిన ఘటన పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో రుక్మిణీ బంధువులు ఫిర్యాదు చేశారు.